ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ముందస్తు అరెస్ట్

ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ముందస్తు అరెస్ట్

KNR: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో విద్యా రంగానికి తక్కువ నిధులు కేటాయించడాన్ని నిరసిస్తూ ఏఐఎస్ఎఫ్ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు కనకం సాగర్‌ను కేశవపట్నం పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముందస్తు అరెస్టులు అప్రజాస్వామిక చర్యలని, చెరసాలలు ఉద్యమాలను ఆపలేవని అన్నారు.