శ్రీ లక్ష్మీనరసింహస్వామి హుండీ లెక్కింపు

NLR: రాపూరు మండలంలోని పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని దేవస్థాన సిబ్బంది సోమవారం చేపట్టారు. దాదాపుగా 38 రోజులకు గాను శ్రీవార్ల హుండీ ఆదాయం 45,88,233 రూపాయలు వచ్చినట్లు కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసులు రెడ్డి తెలియజేశారు. హుండీ ద్వారా వచ్చిన మొత్తంను ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు పెంచలకోన బ్రాంచ్‌నకు జమ చేశారన్నారు.