అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే చదలవాడ
PLD: నరసరావుపేటలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు సోమవారం ఉదయం దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఆలయ కమిటీ సభ్యులు శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారని అన్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని అన్నారు.