టాలీవుడ్ స్టార్లతో 'శివ' రీరిలీజ్ ట్రైలర్

టాలీవుడ్ స్టార్లతో 'శివ' రీరిలీజ్ ట్రైలర్

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నటించిన 'శివ' చిత్రం ఈనెల 14న రీరిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో 4K క్వాలిటీతో కూడిన ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఈ ట్రైలర్‌లో టాలీవుడ్ స్టార్ హీరోలతో పాటు దర్శకులు కూడా సందడి చేశారు. 1989లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచి సంచలనం సృష్టించింది.