రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

నల్గొండ: స్కూటీపై ఇద్దరు వ్యక్తులు నాగార్జునసాగర్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న క్రమంలో పెద్దవూర మండలం పొట్టివానితండా సమీపంలోకి గుర్తుతెలియని వాహనం స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన సంజయ్, నగేష్‌లకు తీవ్రగాయాలయ్యాయి. గమనించి స్థానికులు వారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని కామినేని ఆసుపత్రికి తరలించగా సంజయ్ మృతిచెందాడు.