ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్
CTR: సంక్రాంతి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, ఐక్యత నింపాలని జిల్లా కలెక్టర్ సమిత్ కుమార్ ఆకాంక్షించారు. జిల్లా ప్రజలకు ముందస్తు పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. భోగి పండుగ భోగభాగ్యాలను, సంక్రాంతి పండుగ ఆనందోత్సాహాలను, కనుమ పండుగ కమ్మని కనువిందులను అందించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాట్లు తెలిపారు.