'బైకర్‌' నుంచి వీడియో సాంగ్ రిలీజ్

బైక్ రేసర్‌గా శర్వానంద్ నటించిన సినిమా 'బైకర్'. అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ మూవీలో మాళవికా నాయర్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా డిసెంబరు 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో భాగంగా తొలి పాట 'ప్రెటీ బేబీ' వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది.