కలుషిత కసారంగా మారుతున్న చింతలచెరువు..!

కలుషిత కసారంగా మారుతున్న చింతలచెరువు..!

MDCL: చెంగిచెర్లలోని చింతలచెరువు క్రమంగా కలుషిత కసారంగా మారుతోంది. చుట్టుపక్కల పరిశ్రమల నుంచి వెలువడుతున్న రసాయన వ్యర్థాలు చెరువులో చేరడంతో నీరు తీవ్రంగా కలుషితమవుతోంది. దీంతో గుర్రపు డెక్క విపరీతంగా పెరిగి దుర్వాసనతో పాటు దోమల బెడద పెరుగుతోంది. ప్రజారోగ్యానికి ముప్పుగా మారిన ఈ చెరువును వెంటనే శుభ్రం చేసి పరిరక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.