పల్నాడు జిల్లాలో చెక్ పోస్టులపై నిఘా

పల్నాడు జిల్లాలో చెక్ పోస్టులపై నిఘా

గుంటూరు: సరిహద్దుల్లో ఉన్న చెక్ పోస్టులలో నిఘా పకడ్బందీగా నిర్వహించాలని పల్నాడు కలెక్టర్ శివ శంకర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఇంటిగ్రేటేడ్ చెక్ పోస్టులు -3, సరిహద్దు చెక్ పోస్టులు- 6, ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్టులు -16 ఉన్నాయన్నారు. తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న నగదు, తదితర సామాగ్రి స్ట్రాంగ్ రూముల్లో భద్రపరచాలని కలెక్టర్ సూచించారు.