బంగారు గరుడ వాహనంపై శ్రీరంగనాథుడు

బంగారు గరుడ వాహనంపై శ్రీరంగనాథుడు

నెల్లూరు: నృసింహ జయంతి పర్వదినం సందర్భంగా నెల్లూరు నగరం రంగనాయకులపేటలోని శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానంలో బుధవారం విశేష పూజలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఉదయం శ్రీరంగనాథుడు బంగారు గరుడ వాహనంపై విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చి రంగనాథున్ని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.