సీడ్ యాక్సెస్ జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం
GNTR: తుళ్లూరు(M) దొండపాడు సీడ్ యాక్సిస్ జంక్షన్ వద్ద శనివారం ఉదయాన్నే రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారం ప్రకారం, టిడ్కో గృహాల వైపు నుంచి పాల డబ్బాలతో వేగంగా వస్తున్న వ్యక్తి అమరావతి వైపు వెళ్తున్న ఓ స్కూటీని బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో స్కూటీపై ప్రయాణిస్తున్న వారికి గాయాలయ్యాయి.ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.