ఐపీఎల్ సీజన్-3 విజేత మేడిపల్లి జట్టు

ఐపీఎల్ సీజన్-3 విజేత మేడిపల్లి జట్టు

JGL: ఇబ్రహీంపట్నం క్రీడా మైదానంలో ఇబ్రహీంపట్నం క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐపీఎల్ సీజన్-3 పోటీలు హోరాహోరీగా ముగిశాయి. ఫైనల్ పోరులో మేడిపల్లి జట్టు విజేతగా నిలిచి రూ.42 వేల నగదు బహుమతిని కైవసం చేసుకోగా, అమ్మక్కపేట జట్టు రన్నరప్‌గా నిలిచి రూ.32 వేలు అందుకుంది. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి పంతంగి వెంకటేష్ పాల్గొన్నారు.