ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ అవగాహన ర్యాలీ

ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ అవగాహన ర్యాలీ

కృష్ణా: ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా డీఎంహెచ్‌వో పీ.యుగంధర్ మచిలీపట్నంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో డీఎంహెచ్‌‌వో మాట్లాడుతూ.. ఎయిడ్స్ వ్యాధి నివారణపై సామాజిక అవగాహన పెంపొందించడం, ప్రజల్లో అపోహలను తొలగించడం, ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్యశాఖ సిబ్బంది, ఆశా వర్కర్‌లు, విద్యార్థులు పాల్గొన్నారు.