మోగిన మున్సిపల్ ఎన్నికల నగారా
VKB: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మున్సిపల్ ఎన్నికల నగారా ఇవాళ మోగింది. ఈనెల 28 నుంచి 30వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ నెల 31న నామినేషన్ల స్కూటీని, వచ్చేనెల 3 వరకు నామినేషన్ల ఉపసంహరణ. ఫిబ్రవరి 11న పోలింగ్, 13న కౌంటింగ్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో ఇవాళ్టి నుంచి జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో రానుందని ఎన్నికల సంఘం పేర్కొంది.