వడదెబ్బతో మహిళా రైతు కూలి మృతి

వడదెబ్బతో మహిళా రైతు కూలి మృతి

MHBD: గూడూరు మండలంలో వ్యవసాయ పనులకు వెళ్లిన పులుసం ఎల్లమ్మ (48) అనే మహిళా రైతు వడదెబ్బతో మృతి చెందింది. బొద్దుగొండకు చెందిన ఆమె మిరప తోటలో పనిచేస్తుండగా, తీవ్రమైన ఎండ వేడిమికి అస్వస్థతకు గురైంది. స్థానికులు ఆమెను గూడూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.