నిగ్గు తేల్చేందుకు విచారణ కమిటీ: కలెక్టర్

నిగ్గు తేల్చేందుకు విచారణ కమిటీ: కలెక్టర్

ప్రకాశం: ఒంగోలులోని మెప్మా ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలు వెలువడడంతో కలెక్టర్ రాజాబాబు చర్యలు తీసుకున్నారు. అసలు విషయాలను తెలుసుకునేందుకు జేసీ గోపాలకృష్ణ అధ్యక్షతన విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ 2 వారాల్లో పూర్తి నివేదిక సమర్పించాలని తెలిపారు. దీనిపై కలెక్టర్ కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది.