'అక్రెడిటేషన్ల జీవో 252ను సవరించాలి'
SRPT: జర్నలిస్టుల అక్రెడిటేషన్ల కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో 252ను సవరించాలని టీడబ్ల్యూజేఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు.ఈ మేరకు ఇవాళ కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజేశారు. డెస్క్, ఫీల్డ్ రిపోర్టర్ల మధ్య వివక్ష చూపడం, చిన్న పత్రికలపై కఠిన నిబంధనలు విధించడం సరికాదన్నారు. ఈ జీవోను సవరించి అర్హులైన జర్నలిస్టులందరికీ కార్డులు జారీ చేయాలని కోరారు.