డిజిటల్ జనగణనను సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్

డిజిటల్ జనగణనను సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్

JN: జనగణన-2027 ప్రక్రియలో భాగంగా ప్రజలు డిజిటల్ సెల్ఫ్ ఎన్యూమరేషన్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. ప్రభుత్వ పోర్టల్ ద్వారా కుటుంబ సభ్యులు, నివాస వివరాలను స్వయంగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వ పథకాల సమర్థవంతమైన అమలుకు ఖచ్చితమైన గణాంకాలు అవసరమని, ఈ ప్రక్రియలో ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరారు.