'పార్టీ బలోపేతానికి కృషి చేయాలి'

JN: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సూచించారు. ధర్మసాగర్ మండలానికి చెందిన కాంగ్రెస్ నేత శీషాల కుమార్ స్వామి, పలువురు నాయకులు రాజయ్య సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. రాజయ్య వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రతి ఒక్కరు పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు.