భద్రకాళి ఆలయంలో MLC, ఛైర్మన్ పూజలు

WGL: వరంగల్ భద్రకాళి దేవస్థానంలో కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నేడు వరంగల్ జిల్లా పెరిక కుల(పురగిరి క్షత్రియ) సంఘం వారు ఉభయ దాతలుగా వ్యహరించారు. వారి ఆహ్వానంమేరకు ఈరోజు కళ్యాణంలో MLC బస్వరాజు సారయ్య, కుడా ఛైర్మన్ ఇనగాల వెంకటరామిరెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు అమ్మవారిని దర్శించుకొని, పూజలు చేశారు.