'దర్శిలో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటుకు మంత్రి గ్రీన్ సిగ్నల్'

ప్రకాశం: దర్శి కేంద్రంగా కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటుకు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారని టీడీపీ ఇన్‌ఛార్జ్ డా.గొట్టిపాటి లక్ష్మీ, లలిత్ సాగర్ శనివారం ప్రకటనలో తెలిపారు. అమరావతిలోని మంత్రి ఛాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిసినట్లు చెప్పారు. ఈసందర్భంగా దర్శిలో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు విషయంలో నిధులు మంజూరు చేయాలని వినతిపత్రం అందజేసినట్లు పేర్కొన్నారు.