కొత్తవలసలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం
VZM: కొత్తవలస మండలం చిన్ని పాలెం, ఉత్తర పల్లిలో గురువారం మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేస్తే కలిగే నష్టాలను ప్రజలకు వివరిస్తూ సంతకాల సేకరణ చేపట్టారు. కాగా, కూటమి ప్రభుత్వంలో ఉచిత వైద్యం పేదలకు అందని ద్రాక్షలా మారిందని ఆయన మండిపడ్డారు.