సీపీ రోడ్డును ప్రారంభించిన మంత్రి ఆనం

సీపీ రోడ్డును ప్రారంభించిన  మంత్రి ఆనం

NLR: మహిమలూరు పంచాయతీ కోటపాడు గ్రామానికి నూతనంగా నిర్మించిన సిమెంట్‌ రోడ్డును మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రారంభించారు. శనివారం ఉదయం మహిమలూరులో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు గుండ్రా సతీష్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ ఆనంద్‌తో కలిసి మంత్రి సిమెంటు రోడ్డును ప్రారంభించారు. పంచాయతీరాజ్‌శాఖ ఆధ్వర్యంలో రూ. 74 లక్షలతో ఈ సిమెంటు రోడ్డును నిర్మించారు.