ఘనంగా 'కళా దర్బార్' వేడుకలు
గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో 'కళా దర్బార్' సాంస్కృతిక వేడుక ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, సినీ నటుడు సుమన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మన సంస్కృతిని కాపాడుకోవాలని, ప్రభుత్వం కళాకారులకు అండగా ఉంటుందని జీవీ తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రదర్శనలు ఆహూతులను ఆకట్టుకున్నాయి.