నెల్లూరు జిల్లా పాత SP కృష్ణ కాంత్‌కు పోస్టింగ్
నెల్లూరు జిల్లా ఎస్పీగా సుమారు ఏడాదిన్నర పాటు పనిచేసి ప్రస్తుతం డీజీపీ కార్యాలయంలో వెయిటింగ్లో ఉన్న కృష్ణ కాంత్‌కు ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. లా అండ్ ఆర్డర్ AIGగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు నెల రోజుల నుంచి ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు ఈ నేపథ్యంలో AIG గా పోస్టింగ్ ఇవ్వడంతో రెండు మూడు రోజుల్లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.