కురుమూర్తి బ్రహ్మోత్సవాలకు మంత్రికి ఆహ్వానం
MBNR: తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను చిన్నచింతకుంట మండలం కురుమూర్తి బ్రహ్మోత్సవాలలో పాల్గొనవలసిందిగా దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి శనివారం హైదరాబాద్ క్యాంపు కార్యాలయంలో ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవాలయ విశిష్టతను కురుమూర్తి స్వామి గురించి మంత్రికి వివరించానన్నారు. మంత్రి ఈనెల 28వ తేదీన జరిగే ఉద్దాల వేడుకలకు హాజరవుతానన్నారు.