క్షామంలో కూరుకుపోయిన గాజా: ఐరాస

గాజా కరువులో కూరుకుపోయినట్లు ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఐదు లక్షలమంది ప్రజలు ఆకలిమంటల్లో కాలిపోతున్నారని తెలిపింది. పశ్చిమాసియాలో ఈ స్థాయి దుర్భిక్ష పరిస్థితులు కనిపించడం ఇదే తొలిసారని వెల్లడించింది. ఇజ్రాయెల్ దశలవారీగా అడ్డంకులు సృష్టిస్తుండటంతో ఆహారం ఇక్కడ ప్రజలకు చేరడం సాధ్యం కావడం లేదని UN ఎయిడ్ చీఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఈ వ్యాఖ్యలను ఇజ్రాయెల్ ఖండించింది.