రేపు జిల్లాలో ప్రజా ఫిర్యాదుల వేదిక రద్దు
అన్నమయ్య: రాయచోటి ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరగాల్సిన ప్రజా సమస్యల ఫిర్యాదుల పరిష్కార వేదికను రద్దు చేస్తున్నట్లు జిల్లా SP ధీరజ్ కునుబిల్లి తెలిపారు. ఈ మేరకు ఎస్పీ కార్యాలయ పోలీసులు ప్రజా ఫిర్యాదుల వేదికను రద్దు చేసినట్లు చెప్పారు. దీపావళి పండగ దృష్ట్యా సోమవారం జరగాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేశామన్నారు.