బద్వేల్‌లో ప్రత్యేక ముమ్మర ఓటర్ సవరణ

బద్వేల్‌లో ప్రత్యేక ముమ్మర ఓటర్ సవరణ

KDP: బద్వేల్ రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో ప్రత్యేక ముమ్మర ఓటర్ల సవరణ-2026కు సంబంధించి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఢిల్లీ ప్రధాన కార్యాలయం నుంచి బూత్ స్థాయి అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మార్గదర్శకాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల నమోదు అధికారి పాల్గొని ఓటర్ల సవరణ ప్రక్రియను అమలు చేసే విధానంపై పలు సూచనలు అందించారు.