ఓబన్న ఉద్యమ పోరాటం భావి తరాలకు స్ఫూర్తిదాయకం
CTR: స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డే ఓబన్న ఉద్యమ పోరాటం భావి తరాలకు స్ఫూర్తిదాయకం అని అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పాడేల్ పేర్కొన్నారు. ఓబన్న జయంతిని పురస్కరించుకొని ఆదివారం కలెక్టరేట్ లోని మీటింగ్ హాల్ నందు ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. దేశం కోసం ఆయన అందించిన సేవలను గుర్తు చేశారు.