కేంద్రం ఆధ్వర్యంలో ఉచితంగా ఏఐ కోర్సు

కేంద్రం ఆధ్వర్యంలో ఉచితంగా ఏఐ కోర్సు

ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఉచితంగా ఏఐ కోర్సును అందించనుంది. 'ఇండియాఏఐ' మిషన్‌లో భాగంగా ఈ కోర్సుకు రూపకల్పన చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కోర్సులో భాగంగా విద్యార్థులు, ఉద్యోగులకు ఏఐపై ప్రాథమిక అవగాహన కల్పించనుంది. 4.5 గంటల్లో పూర్తి కోర్సును అందిస్తుంది. రిజిస్ట్రేషన్ కోసం futureskillsprime.inను సంప్రదించండి.