మాస్టర్‌కి ఆత్మీయ వీడ్కోలు
VZM: గరివిడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అలమూరు సత్య శ్రీనివాస్ ఇంగ్లీష్ ఉపాధ్యాయులుగా పని చేసి పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు ఆయనను ఘనంగా సన్మనించారు. వ్యక్తలు మాట్లాడుతూ శ్రీనివాస్ ఉపాధ్యాయుడిగా, యూటీఎఫ్ రాష్ట్ర నాయకులుగా, యోగా గురువుగా సమాజానికి చేసిన సేవలు మరువలేమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు, గ్రామ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.