'ఈనెల 11న విరాట్ హిందూ సమ్మేళనం'
KNR: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో ఈనెల 11న హుజురాబాద్ కందుగుల బొడ్రాయి ఆవరణలో 'విరాట్ హిందూ సమ్మేళనం' నిర్వహించనున్నారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా 8 గ్రామాలతో జరిగే ఈ కార్యక్రమ గోడపత్రికను సోమవారం ఆవిష్కరించారు. ఈ సమ్మేళనానికి హిందూవులు కుటుంబ సమేతంగా తరలివచ్చి విజయవంతం చేయాలని సమితి అధ్యక్షులు కొండం రాజేందర్ రెడ్డి కోరారు.