వేములవాడ కోర్టు ముందు న్యాయవాదుల నిరసన

SRCL: రాష్ట్రవ్యాప్తంగా అడ్వకేట్‌ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఫెడరేషన్ అఫ్ బార్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపుమేరకు సోమవారం వేములవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు ముందు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. న్యాయవాదుల రక్షణ చట్టం, టెన్యూర్ పీపీ నియామకం, 41(ఏ) సీఆర్పీసీ, 35 బీఎన్ఎస్ఎస్, సీఆర్పీసీ అమెండ్మెంట్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.