వైసీపీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శిగా గాబ్రియల్

PLD: జిల్లా వైసీపీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శిగా శుక్రవారం వినుకొండ మున్సిపల్ వైస్ ఛైర్మన్ బేతం గాబ్రియల్ నియమితులయ్యారు. ఈ పదవిని తనకు అప్పగించిన పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డికి, తన నియామకానికి కృషి చేసిన మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పలువురు నాయకులు ఆయనకు అభినందనలు తెలిపారు.