స్త్రీ శక్తి పథకంపై అభిప్రాయాలు తెలుసుకున్న మంత్రి

సత్యసాయి: ధర్మవరం బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో మంత్రి సత్యకుమార్ యాదవ్ పర్యటించారు. స్త్రీ శక్తి పథకంపై మహిళలు, పాఠశాల విద్యార్థుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఉచిత బస్సు ప్రయాణం ఆర్థికంగా ఉపశమనంగా ఉందని మహిళలు, చదువుకు తోడ్పడుతోందని విద్యార్థులు చెప్పడం చాలా సంతోషం కలిగించిందని మంత్రి పేర్కొన్నారు.