రేపు మంగళగిరిలో విద్యుత్ అదాలత్
GNTR: మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని విద్యుత్ సమస్యల పరిష్కారానికి శుక్రవారం ఉదయం 10:30 గంటల నుంచి ప్రత్యేక విద్యుత్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ఏఈ సంజీవరావు తెలిపారు. నగరంలోని చిల్లపల్లి కళ్యాణ మండపంలో జరిగే ఈ కార్యక్రమానికి సీజీఆర్ఎఫ్ ఛైర్‌పర్సన్ విక్టర్ ఇమ్మానుయేలు హాజరవుతారని.. వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.