VIDEO: ఘనంగా శ్రీ రామనవమి వేడుకలు
ASR: అరకులోయ మండలంలో శ్రీ రామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. చొంపి పంచాయతీ కొత్తవలస గ్రామంలో కొలువైన కోదండరామస్వామి ఆలయంలో నిర్వహించిన వేడుకల్లో సుమారు 50 జంటలు సీతారామ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుని, తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.