VIDEO: విరబూసిన బ్రహ్మ కమలం..

WGL: అరుదైన బ్రహ్మకమలం పువ్వు విరబూసింది. శనివారం గీసుకొండ మండలంలోని మొగిలిచర్ల గ్రామానికి చెందిన ఊరుగొండ రవి ఇంట్లో మూడేళ్లుగా బ్రహ్మ కమలం మొక్కను పెంచుతున్నారు. కాగా, బ్రహ్మ కమలం చెట్టుకు పువ్వులు శ్వేత వర్ణంలో విరబూసి అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఏడాదికి ఒకసారి మాత్రమే పూసే పువ్వులు ప్రస్తుతం వికసించడంతో పలువురు తరలివచ్చి ఆసక్తిగా తిలకిస్తున్నారు.