మెడికల్ క్యాంపుల నిర్వహణకు సహకారం

BPT: కొరిశపాడు గ్రామంలో మంగళవారం పలు కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ను ప్రముఖ సినీ నటుడు రఘు బాబు కలిశారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ సాయి తేజ రఘు బాబును కలిసి గ్రామాలలో అందిస్తున్న వైద్య సేవలను గురించి వివరించారు. మెడికల్ క్యాంపులు నిర్వహణకు తన వంతు సహకారం అందిస్తానని రఘుబాబు తెలియజేశారు.