బంగారమ్మతల్లి అమ్మవారిని దర్శించుకున్న హోం మంత్రి అనిత

బంగారమ్మతల్లి అమ్మవారిని దర్శించుకున్న హోం మంత్రి అనిత

AKP: రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత యస్.రాయవరం మండలం రేవుపోలవరం గ్రామంలో బంగారమ్మతల్లి అమ్మవారిని దర్శించుకొని, మొక్కు తీర్చుకున్నారు. సాంప్రదాయబద్ధంగా ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం ఆలయానికి వచ్చిన మహిలను మంత్రి ఆప్యాయంగా పలకరించారు. స్థానిక సమస్యలను ప్రజలు, నాయకులు హోం మంత్రి అనిత దృష్టికి తీసుకెళ్లారు.