ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం

MDK: తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమం చేపట్టారు. డ్రైనేజీల క్లీనింగ్, బ్లీచింగ్ పౌడర్ చల్లడం వంటి కార్యక్రమాలను చేపట్టారు. రక్షిత మంచినీటి ట్యాంకుల వద్ద శుభ్రం చేసి చెత్తాచెదరం తొలగించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పంచాయతీ వాటర్ మెన్ వెంకటేష్‌ను సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ సన్మానించారు.