VIDEO: ఏడుపాయల దుర్గామాతకు ప్రత్యేక పూజలు

MDK: జిల్లాలో అతి పవిత్రమైన పుణ్యక్షేత్రం ఏడుపాయల దుర్గామాత దేవస్థానంలో నేడు సోమవారం పురస్కరించుకొని వేకువ జామున మంజీర నీళ్లతో అభిషేకం చేసే, పట్టు వస్త్రాలతో పసుపు కుంకుమతో అర్చకులు విశేషాలంకరణ చేశారు. తధానంతరం భక్తులకు దర్శన సౌభాగ్యం కల్పించి, తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు.