వాహనాలను తనిఖీ చేస్తున్న RTO అధికారులు
MBNR: జిల్లా వ్యాప్తంగా 44వ జాతీయ రహదారిపై శనివారం ఆర్టీవో అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. అనుమతి పత్రాలు లేని వాహనాలకు భారీగా జరిమానాలు విధించారు. అనుమతి లేని పలు వాహనాలను సీజ్ చేశారు. వివిధ జిల్లాల ఆర్టీవో అధికారులు ఈ తనిఖీల్లో పాల్గొనడంతో వాహనదారులు బెంబేలెత్తారు.