పుత్తూరులో 18న జాబ్ మేళా

పుత్తూరులో 18న జాబ్ మేళా

TPT: పుత్తూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 18న జవహర్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ బీ. చంద్రమౌళి తెలిపారు. ఈ మేళాకు 10 బహుళ జాతి కంపెనీల ప్రతినిధులు హాజరుకానున్నారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు పాల్గొనవచ్చన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.