సిల్వర్ మర్చంట్లో చోరీ

NZB: డిచ్‌పల్లి బస్టాండ్ ఎదురుగా ఉన్న ఓ సిల్వర్ మర్చంట్లో చోరీ జరిగింది. దుకాణం షెట్టర్ పగలగొట్టి గుర్తుతెలియని వ్యక్తులు 800 గ్రాముల వెండి వస్తువులను దొంగిలించినట్లు దుకాణ యజమాని లక్ష్మీనర్సయ్య స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు ఎస్సై షరీఫ్ శుక్రవారం ఘటనా స్థలాన్ని చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.