VIDEO: వైభవంగా సాయిబాబా ఆలయ విగ్రహ పునః ప్రతిష్ట

VIDEO: వైభవంగా సాయిబాబా ఆలయ విగ్రహ పునః ప్రతిష్ట

కోనసీమ: అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం గ్రామంలో శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆలయ విగ్రహ పునః ప్రతిష్ట కార్యక్రమం గురువారం వైభవంగా జరిగింది. వేదమంత్రోచ్చరణాల మధ్య పురోహితులు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి బాబా వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భారీ అన్న సమారాధన నిర్వహించారు.