ఢిల్లీలో భారీ పేలుడు.. ఒకరు మృతి

ఢిల్లీలో భారీ పేలుడు..  ఒకరు మృతి

ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ 1 సమీపంలో పార్కింగ్ చేసిన ఒక కారులో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు ధాటికి అక్కడే ఉన్న 8 వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఘటన తీవ్రత దృష్ట్యా అధికారులు వెంటనే అప్రమత్తమై.. మెట్రో స్టేషన్‌తో సహా పరిసర ప్రాంతాల్లో భద్రతను భారీగా కట్టుదిట్టం చేశారు.