కురవి వీరభద్రస్వామి జాతరలో టెన్షన్… గ్యాస్ లీక్‌తో కలకలం

కురవి వీరభద్రస్వామి జాతరలో టెన్షన్… గ్యాస్ లీక్‌తో కలకలం

MHBD: కురవి మండల కేంద్రంలోని శ్రీ వీరభద్ర స్వామి ఆలయంలో జాతరలో ఆదివారం స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జాతర ప్రాంగణంలో ఓ దుకాణదారుడి వద్ద గ్యాస్ సిలిండర్ లీక్ కావడంతో భక్తుల్లో ఆందోళన చెలరేగింది. ఈ సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గ్యాస్ లీక్‌ను నియంత్రించారు. అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది.