చివరి భూములకు సాగునీరు అందించాలి: కలెక్టర్

VZM: ఖరీఫ్ పంట కాలంలో ఆయకట్టు చివరి భూముల వరకు సాగునీరు అందించాలని కలెక్టర్ డా,బి.ఆర్.అంబేడ్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ భవనంలో నీటిపారుదల, తోటపల్లి బ్యారేజి ప్రాజెక్టు అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. తోటపల్లి బ్యారేజి ప్రాజెక్టు నుండి జూలై ఆరవ తేదిన నీరు విడదల చేయడం జరిగిందన్నారు.